calender_icon.png 5 March, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంతారా ప్రారంభం

05-03-2025 12:04:02 AM

గాంధీనగర్: ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస, సంరక్షణ కేంద్రం ‘వంతారా’ను ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. ఆసియాటిక్ సింహం, తెలుపు సింహం పిల్లలతోపాటు క్లౌడెడ్ చిరుత కారకల్(ఒక రకమైన అడవి పిల్లి) పిల్లలతో ప్రధాని సరదాగా గడిపారు.

తెలుపు సింహం కూనను ఎత్తుకుని దానికి ఆహారాన్ని అందించారు. పధాని నరేంద్రమోదీకి ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. సుమారు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో దాదాపు 1.5 లక్షల వన్య ప్రాణులు ఆశ్రయం పొందుతున్నాయి.