calender_icon.png 11 March, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ వాదం బలంగా ఉంది

07-03-2025 12:00:00 AM

 ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉందని, బీసీ సంఘాల పోరాటంతోనే రాజకీయ పార్టీలన్నీ బీసీ నినాదం ఇస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.

గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మీడియా  సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్‌కుమార్‌ను నియమించి, ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేననన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీలా వెంకటేశం, భూపేశ్‌సాగర్, వేముల రామకృష్ణ, రాజేందర్ పాల్గొన్నారు. 

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో పెట్టాలి

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పార్లమెంట్లో కొట్లాడుతానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మార్చి 26న ఢిల్లీలో నిర్వహించబోయే ధూంధాం పోస్టర్‌ను గురువారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్లే 1935లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పడిందన్నారు.