calender_icon.png 9 October, 2024 | 10:04 AM

మహాత్మాగాంధీ ప్రారంభించిన బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

06-10-2024 12:00:00 AM

బొంబే (ప్రస్తుతం ముంబై)లో 1919 నవంబర్‌లో సేథ్ సీతారామ్ పొద్దార్ నెలకొల్నిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ కార్యాలయాన్ని 2021లో స్వయంగా మహాత్మా గాంధీ ప్రారంభించారు. ఇప్పుడది ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఆస్తుల రీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ల తర్వాత ఐదవ పెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్నది.

1947లో దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి యూనియన్ బ్యాంక్‌కు నాలుగు శాఖలున్నాయి. 1969లో కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసే సమయానికి శాఖల సంఖ్య 240కి చేరుకున్నది. అటుతర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేటు రంగంలోని మూడు బ్యాంక్‌లను టేకోవర్ చేయడంతో బ్యాంక్ శాఖల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2007లో యూనియన్ బ్యాంక్ కొన్ని దేశాల్లో కార్యాలయాల్ని తెరిచి అంతర్జాతీయంగా విస్తరించింది. 

రూ.90 వేల కోట్ల మార్కెట్ విలువ

స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.90,733 కోట్లు. గడిచిన మూడేండ్లలో కెనరా బ్యాంక్ షేరు 3 రెట్లు పెరిగింది. 

8,400కుపైగా శాఖలు.. రూ.13.91 లక్షల కోట్ల ఆస్తులు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2024 జూన్‌నాటికి దేశవ్యాప్తంగా 8,473 శాఖలు ఉన్నాయి. 9,300పైగా ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 75,000కుపైగా ఉద్యోగులు ఉన్నారు ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.13.91 లక్షల కోట్లు.  ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 83.49  శాతం వాటా ఉన్నది. యూనియన్ బ్యాంక్‌కు ప్రస్తుతం శ్రీనివాసన్ వరదరాజన్ నాన్ చైర్మన్‌గా ఉన్నారు. మణిమేఖలై ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 

ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనం

పీఎస్‌యూ బ్యాంక్‌ల సంఖ్య ను తగ్గించే క్రమం లో కేంద్రం ప్రతిపాదించిన విలీన ప్రక్రియలో భాగం గా 2020లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన ఉన్న ఆంధ్రాబ్యాంక్, మరో మరో ప్రభుత్వ రంగ కార్పొరేషన్ బ్యాంక్‌ను విలీనం చేశారు. దీనితో యూనియన్ బ్యాంక్ ఐదవ పెద్ద పీఎస్‌యూ బ్యాంక్‌గా ఆవిర్భవించింది.