calender_icon.png 25 December, 2024 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు డబ్బును కాజేసిన బ్యాంకు సిబ్బంది?

22-12-2024 02:02:56 AM

పోలీసులకు రైతు ఫిర్యాదు

ఆదిలాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ఓ రైతు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలు మాయమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని మనియార్ పూర్ గ్రామానికి చెందిన రైతు ఆత్రం రాందాస్ ఈ ఏడాది ఆగస్టు 28న మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలోని రూ.50 వేలు డ్రా చేసేందుకు విత్ డ్రా వోచర్ రాసి క్యాష్ కౌంటర్ వద్ద ఇచ్చాడు. రూ.20 వేల చొప్పున మాత్రమే ఇస్తామని, రూ.20 వేలకు మరో విత్ డ్రా వోచర్ రాయమని బ్యాంక్ సిబ్బం ది సూచించారు.

దీంతో రైతు రూ.20 వేలకు మరో వోచర్ రాసి ఇచ్చాడు. కానీ ముందుగా రూ.50 వేల కోసం రాసి ఇచ్చిన వోచర్‌ను బ్యాంక్ సిబ్బంది తిరిగి ఇవకుండా వారి వద్దనే ఉంచుకున్నారు. తాజాగా 3 రోజుల క్రితం మళ్లీ రూ.50 వేల కోసం బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని బ్యాంక్ అధికారులు చెప్పారు.

ఆందోళన చెందిన రైతు బ్యాంక్ స్టేట్‌మెంట్ పరిశీలించగా ఆగస్టు 28న తాను ముందుగా రాసిచ్చిన రూ.50 వేల రసీదుపై అదే రోజు డబ్బులు డ్రా చేసినట్లు చూపించింది. బ్యాం క్ అధికారులను నిలదీయగా తమకేమీ తెలియదని సమాధానం చెప్పడంతో శనివారం బేలా పోలీస్ స్టేషన్‌లో ఆదిలాబాద్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డితో కలిసి ఫిర్యాదు చేశాడు.