calender_icon.png 1 February, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వించేందుకు వస్తున్న బద్మాషులు

30-01-2025 12:00:00 AM

మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో శంకర్ చేగూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. తార స్టొరీ టెల్లర్స్  బ్యానర్ పై బీ బాలకష్ణ, సీ రామ శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి ‘బద్మాషులు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

గ్రామీణ నేపథ్యంలో జరిగే హాస్య భరిత చిత్రమిది. ప్రతి సన్నివేశంలో కడుపుబ్బా నవ్వుకుని ఆ అనుభూతిని నలుగురు పంచుకునే చిత్రమని, ఇది కథనం పరంగా నవ్విస్తూనే గొప్ప సందేశాన్ని ఇస్తుందని మేకర్స్ పేర్కొన్నారు.