calender_icon.png 9 October, 2024 | 1:54 PM

కలి కథా నేపథ్యం కొత్తగా ఉంది

03-10-2024 12:00:00 AM

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేశ్ అగస్త్య నటిస్తున్న చిత్రం ‘కలి’. ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ శేషు దర్శకుడు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకుడు సినిమా విశేషాలను పాత్రికేయులతో పంచుకున్నారు. 

* తెలుగు చిత్ర పరిశ్రమలో పాత్రికేయుడిగా, మూవీ రైట్స్ కన్సల్టెంట్‌గా, రచయితగా పాతికేళ్లుగా జర్నీ చేస్తున్నా. ఈ క్రమంలో నా మనసుకు నచ్చిన చిత్రాలకు సమర్పకుడిగా పనిచేశా. ‘కలి’ కథకు బాగా ఇంప్రెస్ అయ్యి ఈ మూవీకీ వర్క్ చేశా. 

* ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా అడ్డుకుంటే, వారికి మరోసారి అలాంటి ఆలోచనలు రావు. దర్శకుడు ఈ పాయింట్‌తోనే కథ రాసుకున్నాడు. నేపథ్యం కొత్తగా ఉంది.  

* ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రతిభ గల నటులు. ‘కలి’లో నువ్వా నేనా అన్నట్లు నటించారు. లీలా గౌతమ్ సినిమా మేకింగ్‌పై ప్యాషన్ ఉన్న పాతికేళ్ల యువకుడు. ఆ ఏజ్ వాళ్లు ప్రేమకథలతో సినిమా నిర్మి స్తారు. కానీ లీలా ‘కలి’ లాంటి మెచ్యూర్డ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. అతనికి ప్రొడ్యూసర్‌గా మంచి ఫ్యూచర్ ఉంది. శివశేషుకు పురాణాల మీద పట్టు ఉంది. అతనికి ‘కలి’ పేరు తెస్తుంది. 

* కథా రచయితగా నా ప్రయాణం కొనసాగుతోంది. ప్రస్తుతం నేను స్టోరీ ఇచ్చిన సినిమా ఒకటి అమెరికాలో షూటింగ్ జరుగుతోంది. డివోషనల్ స్టోరీతో మరో మూవీ స్క్రిప్ట్ చేశా. ఆ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.