చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులు దళారుల చేతుల్లో ఎలా మోసపోతున్నారనే కథాంశంతో భూదాన్ పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది అవార్డ్ 1996’. పలు యధార్థ సంఘటనల ఆధారంగా మెగా మేజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చిరందాసు ధనుంజయ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌బాబు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ.. “మంచి హృదయంతో ఈ సినిమా తీశారు. చేనేత కళాకారులు, వారి సమస్యలను సమాజానికి చూపించాలనుకోవడం అభినందనీయం” అన్నారు. శివరామ్‌రెడ్డి, సాయిచందన జంటగా నటించగా బన్నీ అభిరన్ కీలక పాత్ర పోషించారు.