26-06-2024 12:10:00 AM
న్యూఢిల్లీ, జూన్ 25: ప్రస్తుత 2024వ సంవత్సరం ప్రధమార్థంలో దేశీ ఈక్విటీ ఫండ్స్ సగటున 17.67 శాతం రాబడిని అందించాయి. దేశంలో దాదాపు 263 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. 30 శాతంపైగా లాభాలను ఇచ్చిన నాలుగు ఫండ్స్ మిడ్‌క్యాప్ విభాగంలో ఉన్నాయి. 31.64 శాతం రిటర్న్‌తో క్వాంట్ మిడ్‌క్యాప్ ప్రధమస్థానంలో ఉన్నది. జేఎం మిడ్‌క్యాప్ 31.37 శాతం, ఐటీఐ మిడ్‌క్యాప్ ఫండ్ 30.78 శాతం చొప్పున లాభాలు అందించాయి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ 30.53 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈక్విటీ మార్కెట్లు జోరు చూపించడంతో ఈక్విటీ మ్యూచవల్ ఫండ్స్ మంచి పనితీరుని ప్రదర్శించాయి.