calender_icon.png 20 October, 2024 | 4:01 PM

ఒంటిపై పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ ముందు హల్చల్..

20-10-2024 12:16:42 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపెల్లి  పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుంటానని ఆటో డ్రైవర్ హంగామా సృష్టించాడు. పెద్దపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రెహ్మాన్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేశాడు. అర్ధరాత్రి పోలీసులు తన ఆటోను తీసుకువచ్చారని, ఎందుకు ఆటో తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక దొంగలా తనను వీడియో తీశారని అవేదన వ్యక్తం చేశారు. అవక్కయిన పోలీసులు అప్రమత్తమై రెహమాన్ ను సముదాయించి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారు. పట్టణంలో జరిగిన ఒక దొంగతనం కేసులో ఆటోను పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చినట్లు తెలిసింది.