10-03-2025 12:00:00 AM
కరీంనగర్, మార్చి 9 (విజయక్రాంతి): బాజా భజంత్రీలు.. మేలా తాళాలు ఒకవైపు.. పెద్ద ఎత్తున అతిథులు.. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మరోవైపు.. కోలాహలం. సందడే సందడి.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సంద ర్భం ఆది. అదొక వైభవోపేతంగా జరిగిన ఘట్టం.. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించిన వివాహ వేడుక.. ఈ వేడుకకు కరీంనగర్ లోని కళాభారతి ఆడిటోరియం వేదిక అ యింది.
ఈ పెండ్లికి పెద్దలుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెద్దలుగా వ్యవహరించారు. ఈ వివాహ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సధ నంలో పెరిగిన ఓ అనాథ యువతికి ఆదివారం కరీంనగర్ కళాభారతిలో జిల్లా కలె క్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు.
ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. అనాథ అయినా ఎలాంటి లోటు రాకుండా అధికారులే అమ్మానాన్న అయ్యారు. తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వర్తించారు జిల్లా కలెక్టర్. ఆమెకు కలెక్టర్, ఎమ్మెల్యే సత్యనారాయణ, అధికారులందరూ పెద్దదిక్కుగా నిలిచారు.
ఏ యువతికి కూడా జరగని విధంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి కరీంనగర్ జిల్లాలోనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అనాథలకు మేము తోడుగా నిలుస్తామనే భరోసాను కల్పించారు. అనాథలు ఎవరు కూడా ఎవరూ లేరనే బాధ పెట్టుకోవద్దని నిరూపించారు.
వివరాల్లోకి వెళితే తల్లిదండ్రులు లేకపోవడంతో 2017లో పూజ (మౌనిక)ను కరీం నగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడ అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతోపాటు ఆలనాపాలన చూశారు. ఇంటర్ తర్వాత ఎంపీహె డబ్ల్యూ కోర్సు చేసి ఇంటర్నిషిప్ చేస్తుండగా పెద్దపెల్లి జిల్లా మంథనికి చెందిన సాయి తేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఈ విషయం యువతి అధికారులకు చెప్పడంతో .. యువకుడితో మాట్లాడగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో మహి ళ, శిశు సంక్షేమశాఖ అధికారులు పెళ్లి నిశ్చయించారు. అధికారులే పెళ్లి పెద్దలుగా మారి అన్ని పనులు చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పెళ్లికి వచ్చే అతిథులకు భోజనం ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
కలెక్టర్ పమే లా సత్పతి దంపతులను ఆశీర్వదించి.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తాను స్వయంగా రాసిన లెటర్ ను వధూవరులకు అందించారు. అదేవిధంగా మౌనిక వివాహానికి జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, జిల్లా యంత్రాంగం, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నాయకులు వివిధ శా ఖల అధికారులు అందరూ సహాయం అం దించారు.
అందరూ కలిసి మౌనిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీసీపీఓ పర్వీన్, స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు శోభారాణి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, సిడిపివోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.