calender_icon.png 10 October, 2024 | 6:55 PM

ఆసీస్‌ను మడతబెట్టారు

03-10-2024 12:00:00 AM

తొలి అనధికారిక టెస్టులో భారత్ విజయం

చెన్నై: ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో భారత అండర్-19 జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 293 పరుగులు చేయగా.. భారత్ 296 పరుగులు చేయగల్గింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 214 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో విజయం కోసం భారత జట్టుకు 212 పరుగులు అవసరం అయ్యాయి.

చివరి రోజు లంచ్‌కు ముందు బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత కుర్రాళ్లు 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు. నిత్య పాండ్య (51), నిఖిల్ కుమార్ (55*) అర్ధ సెంచరీలతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కాన్నర్ 4, రామ్ కుమార్ 3 వికెట్లు తీసుకున్నా కానీ విజయం మాత్రం భారత్‌నే వరించింది. అజేయ అర్ధ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన నిఖిల్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో అనధికారిక టెస్టు   ఈ నెల 7 నుంచి మొదలు కానుంది.