09-02-2025 12:00:00 AM
బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నూతన దర్శకుడు ఆర్‌వీఎస్ నిఖిల్ తెరకెక్కించారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా శనివారం మీడియాతో మాట్లాడారు.
“బ్రహ్మానందం’ టైటిల్ మాకు దొరకలేదు. కాబట్టి ‘బ్రహ్మా ఆనందం’ అని మార్చాం. తాత, మనవడు రిలేషన్, కథ నాకు బాగా నచ్చింది. బ్రహ్మానందం గారు నటించకపోతే ఈ సినిమా తీయలేం. ఇంత వరకూ ఆయన్ను చూడని పాత్రల్లో, ఎమోషన్స్‌లో చూస్తారు. హీరో పాత్ర కోసం చాలా మందిని ట్రై చేశాం.
వెన్నెల కిషోర్ గారి పేరుని బ్రహ్మానందం గారు రికమండ్ చేశారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ పంపాం. ఆయన స్క్రిప్ట్ చదువుకున్నారు. హీరో బ్రహ్మా క్యారెక్టర్ కాకుండా.. ఫ్రెండ్ క్యారెక్టర్ గిరి అయితే బాగుంటుంది అదు చేస్తానని వెన్నెల కిషోర్ గారు అన్నారు.
ఆ తరువాత రాజా గౌతమ్ గారి పేరు చర్చల్లోకి వచ్చింది. ఈ మూవీకి అందరూ బ్రహ్మానందం కోసం వస్తారు. కానీ ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం రాజా గౌతమ్‌ను తీసుకెళ్తారు. అతని పెర్ఫామెన్స్, యాక్టింగ్ అంతలా మెస్మరైజ్ చేస్తుంది. మంచి సందేశం కూడా ఉంటుంది.