‘అలనాటి రామచంద్రుడు’ థ్యాంక్స్ మీట్‌లో హీరో కృష్ణవంశీ
కృష్ణవంశీ, మోక్ష హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వంలో హైనివా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు. శుక్రవారం థియేటర్ల ద్వారా విడుదలైందీ మూవీ. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో మూవీ యూనిట్ శనివారం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటుచేసింది. హీరో కృష్ణవంశీ మాట్లాడుతూ.. “ప్రేక్షక దేవుళ్లు అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమైంది.
మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరును చూస్తే మాటలు రావటంలేదు. నన్ను నటుడిగా మలిచిన గురువుకు, అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటాను” అన్నారు. డైరెక్టర్ గారు పాషన్‌తో సినిమా చేశారు’ అని తెలిపింది హీరోయిన్ మోక్ష. దర్శకుడు ఆకాశ్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతల బృందానికి చాలా థ్యాంక్స్. వాళ్లు లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు’ అన్నారు. సోల్‌ఫుల్ మ్యూజికల్ హిట్ పేరుతో ఏర్పాటు చేసి ఈ థ్యాంక్స్ మీట్‌లో సంగీత దర్శకుడు శశాంక్‌ను వక్తలందరూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ వేదికపై ప్రొడ్యూసర్స్ బృందం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.