calender_icon.png 16 January, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకుడంటే లెక్కేలేదు

16-01-2025 12:52:31 AM

* -టికెట్, పార్కింగ్ డబ్బులు వసూల్‌కే పరిమితం 

* ప్రముఖ థియేటర్లో కూడా ప్రేక్షకుడికి తాగునీరు అందించలేని వైనం

* తాగునీరు కావాల్సివస్తే బాటిల్ కొనవాల్సిందే

మహబూబ్ నగర్, జనవరి 15 (విజయ క్రాంతి): వినోదం, మనసు ప్రశాంతత కోసం సినిమా థియేటర్లను ఎంతోమంది ప్రేక్షకు లు ఆశ్రయిస్తారు. ఎలాగైనా తమ అభిమాన హీరోలు నటించిన సినిమాలను తిలకించేం దుకు ఎంతో ఆశతో థియేటర్ వైపు చూస్తు న్న ప్రేక్షకుడికి జేబులో చిల్లులు పడడం తప్ప వారికి కనీస సదుపాయాలు కల్పించడంలో థియేటర్ యజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తు న్నారు.

థియేటర్కు వచ్చే ప్రేక్షకుడికి అతి పెద్దల టికెట్ ఎలా కొట్టాలనే చూస్తున్నారు తప్ప థియేటర్లో వారికి కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించడం లేదంటే ప్రేక్షకుడిపై థియేటర్ యజమానాలకు ఎంత మేడం ఉందో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

-ప్రేక్షకుడి ఆవేదన ను పట్టించుకోని థియేటర్ యజమాన్యం ప్రేక్షకుడి ఎన్నో ఆవేదనలతో థియేటర్కు వచ్చి సంతోషంగా కాలక్షేపం చేద్దామను కున్నా థియేటర్ విజయవాడ మాత్రం వారి కి కనీస సదుపాయాలు కల్పించడంలో విఫ లమవుతున్నాయని ప్రేక్షకులు ఆవేదన చెం దుతున్నారు.

కొన్ని థియేటర్లలో అయితే దిగువ తరగతి ప్రేక్షకుడికి మరుగుదొడ్ల సదు పాయాలు కల్పించడంలో కూడా బాధ్యతగా వివరించడం లేదని ప్రేక్షకుడు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. నిబంధనల వెలుగు టికె ట్ ధరలు పెంచుకున్న అందుకు తగ్గట్టుగా సదుపాయాలను కల్పించడంలో కూడా థియేటర్ యజమానియాలో బాధ్యతగా వ్యవహరించాలని ప్రేక్షకులు వాదిస్తున్నారు.

వందలాది రూపాయలు ఖర్చుపెట్టి సినిమా కు వెళ్తే అక్కడ కనీసం తాగునీరు కూడా లేకుంటే ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలి యని పరిస్థితి నెలకొంటుంది. అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని పలువురు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల మేరకు పార్కింగ్ విభాగంలో ద్విచక్ర వాహనానికి రూ 30, ఆటో కారు ఇలా వాహనాలను బట్టి పార్కింగ్ వసూలు చేస్తుండ్రు. ఇక్కడ ప్రేక్షకుడు ఎలాంటి సందే హం తెలుపకపోయినప్పటికీ సినిమా బ్రేక్ విషయంలో క్యాంటీన్లో కనీసం తాగునీరు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. స్పందిం చాల్సిన అధికార యంత్రం అటువైపు చూడడమే మానేసినట్టు కనిపిస్తుంది. 

అటువైపు చూడని అధికార యంత్రాంగం...

సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.. ప్రేక్షకుడు రోజులో నాలుగు మార్లు వస్తుం టారు పోతుంటారు.. అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ.. ప్రేక్షకుడికి థియేటర్ యజమానులు కల్పించవలసిన కనీస సదు పాయాలు కల్పించేందుకు అధికారులు మాత్రం థియేటర్ యజమానాలపై ఎలాం టి ఒత్తిడి తేవడం లేదని దర్శనమిస్తుంది. ఇకనైనా అధికార యంత్రాంగం థియేటర్లను సమయం లభించినప్పుడల్లా ప్రత్యేక తనిఖీ లు నిర్వహించి నియమ నిబంధనలను అమలు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది.