calender_icon.png 19 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులు పాత్రలతో లీనమైపోతారు

12-04-2025 12:00:00 AM

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘ఓదెల2’.  అశోక్‌తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డీ మధు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా నిర్మాత డీ మధు విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.  “ఓదెల2’ కథను అనుకోకుండా సంపత్ నంది నాతో చెప్పారు.

నాకు కంటెంట్ చాలా నచ్చింది. అలా ప్రాజెక్టు మొదలైంది. సినిమాపై పాషన్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చా. మంచి కథలు కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్టెడ్‌గా చేయాలనేదే నా ప్రయత్నం. ఏదైనా విభిన్నంగా చేయాలనుకుంటా. అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో, టీజర్ లాంచ్ మహా కుంభమేళాలో చేశాం. నేను -కచ్చితంగా కథ గురించి చాలా చర్చిస్తా. తప్పకుండా నేను సెట్స్‌కి వెళ్తా.

సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయని నమ్మాం కాబట్టే ఈ సినిమా తీశాం (నవ్వుతూ). ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ స్కేల్‌లో నిర్మించాం. -ఈ సినిమా కథ లాజికల్‌గా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. తమన్నా అద్భుతంగా నటించారు. ఫస్ట్‌లుక్‌తోనే ఆ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ కథ విషయంలో తమన్నా చాలా ఎక్సైట్ అయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.

ఏప్రిల్, మే ఎండల్లో చెప్పులు లేకుండా షూటింగ్ చేశారు. తమన్నా, వశిష్ఠ క్యారెక్టర్ల మధ్య టగ్ అఫ్ వార్‌లా ఉంటుంది. మిగతా పాత్రలు కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులు పాత్రలతో లీనం అయిపోతారు. -ఇందులో గ్రాఫిక్స్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది.

పంచభూతాల కాన్సెప్ట్‌ను గ్రాఫిక్స్‌లో చూపించాం. నాకు మంచి ఎమోషన్ ఉన్న కథలతో సినిమాలు తీయాలని ఉంది. నేను చేసిన పంచతంత్ర కథల్లో కూడా ఎమోషనే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ కథలూ ఇష్టమే” అని చెప్పారు.