calender_icon.png 25 April, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివశంభోను ప్రేక్షకులు ఆదరిస్తారు

24-04-2025 12:00:00 AM

కృష్ణ ఇస్లావత్, సాయిచక్రవర్తి, కేశవర్ధిని, బేబి రిషిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శివశంభో’. నర్సింగ్‌రావు దర్శకత్వంలో అనంత ఆర్ట్స్ బ్యానర్‌పై బొజ్జ రాజగోపాల్, దోరవేటి సుగుణ నిర్మించారు. తనికెళ్ల భరణి, సుమన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ గోరేటి వెంకన్న, బీజేపీ నేత చీకోటి ప్రవీణ్, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, బర్దీపుర పీఠాధిపతి సిద్ధేశ్వరగిరి స్వామి, ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ గోరేటి వెంకన్న మాట్లాడుతూ.. ‘సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ అరుదైన సినిమాను మనమందరం గౌరవించాలి.

ఇలాంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు’ అన్నారు. భరణి మాట్లాడుతూ.. ‘ఇలాంటి భక్తిరస చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి’ అన్నారు. ‘నర్సింగ్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతిఒక్కరి హృదయాల్లో నిలిచిపోతుంది. చిత్రసీమలో ఇది చెప్పుకోదగ్గ సినిమాగా నిలవాలి’ అని అకాంక్షించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఎంతో శ్రమకోర్చి ఈ సినిమాను నిర్మించాం’ అని చెప్పారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకుడు దోరవేటి చెన్నయ్య మాట్లాడుతూ.. ‘ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. అందరూ అభినందిస్తుండటంతో ఆనందంగా ఉంది’ అని తెలిపారు.