24-03-2025 11:19:18 PM
చర్ల గ్రామపంచాయతీ సంత గోవేలం పాటలో గిరిజన ముసుగులో పాల్గొనే బినామీ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి..
GSP రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ..
చర్ల (విజయక్రాంతి): చర్ల మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం పంచాయతీ సెక్రటరీ సురేష్ కు సంత వేలంపాట సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గ్రామపంచాయతీలో బహిరంగ సంత వేలం పాట నిర్వహించుటకు సంబంధిత అధికారులు షెడ్యూల్ విడుదల చేశారని, ఈ సంత వేలంపాట షెడ్యూల్ ఏరియా పీసా చట్టం రూల్స్ ప్రకారంగా నిర్వర్తించి ఆదివాసి నిరుద్యోగులకు అవకాశం కల్పించి ఉపాధి పొందే విధంగా అధికారులు కృషి చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ సూచించారు.
ప్రతి సంవత్సరం పాట సమయంలో అడే బుడే అమాయక గిరిజనులను పట్టుకొని వారి ద్వారాగా గిరిజనుల తరుపున డీడీలు కట్టించి పాటలో పాల్గొని బినామీలుగా చలామనీ అవుతున్నారని, అలాంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసారి సొంత పాటలో బినామీలు ప్రవేశిస్తే మాత్రం ఆదివాసులు తిరగబడి వారిని కట్టడి చేస్తారని, అధికారులు కూడా ఏజెన్సీ రూల్స్ ప్రకారంగా సంత వేలంపాట నిర్వర్తించి పూర్తిగా ఆదివాసులు ఉపాధి పొందే విధంగా పాటను నిర్వర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పూనెం వరప్రసాద్ జీఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ఫా ప్రకాష్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర నాయకులు సరేం రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.