పూర్వ విఆర్వోల సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ సుధాకర్ రావు పాటిల్
కామారెడ్డి (విజయక్రాంతి): నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి పట్ల ఆందోళనకారులు వివాహరించిన తీరు బాధాకరమని జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పూర్వ విఆర్వోల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సుధాకర్ రావు పాటిల్ ఖండించారు. బుధవారం కామారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులపై నిన్న లగచర్ల నేడు దివాలా వల్పూర్ లో రెవిన్యూ అధికారుల పట్ల ఆందోళన కారు వ్యవహరించిన తీరు పట్ల ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారులకు రక్షణ కల్పించాలని మొన్న కలెక్టర్ పై జరిగిన సంఘటన మరువక ముందే బుధవారం నిర్మల్ ఆర్డీవోపై జరిగిన సంఘటన ఉద్యోగస్తుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ సంఘటనలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులకు రక్షణ కల్పించాలని కోరారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు.