‘ఆరోగ్య మిషన్ బకాయిలు వెంటనే విడుదల చేయమని’ కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసినట్టు ఇవాళ వార్త వచ్చింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.693 కోట్లు రావాల్సి ఉందంటున్నారు. ఈసారే కాదు, గతంలోనూ అనేక సందర్భాలలో ఇలా రెగ్యులర్‌గా విడుదల చేయవలసిన నిధులను కేంద్రం ఎందుకు విడుదల చేయదో అర్థం కాదు. రాష్ట్రాలు తమ బకాయిల సొమ్ము కోసం కేంద్రాన్ని వేడుకొనే పరిస్థితులు మారాలి. ప్రజలు సకాలంలో పన్నులు కట్టకపోతే ప్రభుత్వాలు ఊరుకోవు కదా! ప్రభుత్వాల మధ్య కూడా బకాయిలు పేరుకుపోయే స్థితి సమంజసం కాదు.
ఎ.అశోక్, కామారెడ్డి