calender_icon.png 20 April, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీఎం యాజమాన్యం వైఖరి మారాలి

09-04-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్‌నగర్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కార్మికుల పట్ల ఎస్పీఎం యాజమాన్యం అవలంబిస్తున్న మొండివైఖరి మార్చుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ పున--ఃప్రారంభానికి బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఎంతో కృషి చేసిందన్నారు.

పరిశ్రమ పున--ఃప్రారంభం తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన వారిని అందలమెక్కించుకొని స్థానిక కార్మికులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించకుండా అన్యాయం చేస్తుందని ఆరోపించా రు. కార్మికుల శ్రేయస్సు కోరి నాటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున జీఎస్టీ, విద్యుత్, పెద్దవాగునీరు, కలప, బొగ్గు ఇతర రాయితీలు కల్పించాలని గుర్తు చేశా రు.

ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి లక్షల రూపాయల్లో జీతాలు ఇస్తూ స్థానికులకు మాత్రం 25 వేలు మించి ఇవ్వడం లేదని దీంతోపాటు క్యాంటీన్ సౌకర్యం కూడా కల్పించకపోవడం శోచనీయన్నారు. ఉద్యోగ అర్హత ఉన్న 200 మంది కార్మికులను ఇప్పటికీ ఉద్యోగంలోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.

కార్మిక సమస్యలు నెరవేరాలంటే గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నాయకులు రాజ్ కుమార్ ,శ్యామ్ రావు, మోయిన్ ,కార్మిక సంఘం నాయకుడు ఓదెలు కార్మికులు రాములయ్య , అశోక్ రాజన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.