calender_icon.png 13 February, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలిసభ్యుల వైఖరి మారాలి

13-02-2025 12:00:00 AM

తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరో 15 రోజుల్లో పోలింగ్ ఉంది. వాస్తవానికి మండలి ఎన్నికల్లో ఎన్నికయ్యే సభ్యులద్వారా ఇటు ఉద్యోగులకు, అటు నిరుద్యోగ యువతకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. పదవుల కోసమే అవి పనికి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.

టీచర్లు, గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొనే సమస్యలను చట్టసభలో లేవనెత్తడం ఎంతో అరుదై పోతున్నది. వీళ్లనుంచి పరిష్కారాలు ఆశిం చడం ప్రజలకు అత్యాశగానే ఉంటున్నది. గెలిచిన తర్వాత చాలావరకు సభ్యులు సరైన పాత్ర నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఇక నుం చి అయినా ఈ విధానంలో మార్పు రావాలి.

వారు సమస్యలపట్ల తగిన అవగాహనతో పరిష్కారం లభించేలా కృషి చేయాలి. నిజాయితీగా అందరికోసం పని చేయాలి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్స్‌లో 70 శాతంగా ఉన్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు ఓటుహక్కు లేకపోవడం శోచనీయం. 

 రావుల రామ్మోహన్‌రెడ్డి, వెల్దండ