15-02-2025 12:48:57 AM
చేవెళ్ల, ఫిబ్రవరి 14: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం చిలుకూరులో రంగరాజన్‌ను ఆయన పరామర్శించారు.
అనంతరం ఆయ మాట్లాడుతూ.. అసమానతలు ఉన్న దేశంలో సమానత్వం కోసం పోరాడుతున్న రంగరాజన్ లాంటి అర్చకుడిపై రామరాజ్యం పేరుతో కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఘటనను సీరియస్ తీసుకోవాలని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని కోరారు. ఆయనవెంట కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీమ్ భరత్, పెద్దపల్లి మాజీ ఎంపీ నేతకాని వెంకటేశ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ తదితరులు ఉన్నారు.
మరో నలుగురు అరెస్ట్
రంగరాజన్‌పై దాడి చేసిన 22 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లాకు చెందిన జీ రమాదేవి, ఏ రాజ్యలక్ష్మి, బీ ముకాంబిక, ఏపీలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన సీ జగదీశ్‌ను అరెస్ట్ చేశారు.
ఎంపీ ఈటల పరామర్శ
రంగరాజన్‌ను ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. దాడి జరిగిన తీరును రంగరాజన్‌ను అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభు త్వానికి సూచించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.