ఎంపీ మల్లు రవి
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): పథకం ప్రకారమే ప్రజా ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఎంపీ మల్లు రవి విమర్శించారు. కొడంగల్‌లో భూ సేకరణ విషయమై గ్రామస్తులతో వికారాబాద్ కలెక్టర్ సమావేశమ య్యేందుకు వెళితే.. బీఆర్‌ఎస్ నేతల ఆదేశాల మేరకు కొందరు రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి చేశారని మంగళవారం ఒక ప్రకట నలో ఆయన ఆరోపించారు.
ఇది సీఎం రేవంత్‌రెడ్డిపైన జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అన్నారు. కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడూ అహింస మార్గంలోనే పోరాటం చేసిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కు రేవంత్ డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలే బీఆర్‌ఎస్‌కు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దాడులకు పాల్పడ టం సరికాదని, కొడంగల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.