11-02-2025 07:51:34 PM
మునుగోడు నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చిరువెల్లి ప్రవీణ్ శర్మ..
మునుగోడు (విజయక్రాంతి): చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడి చాలా హేయనీయమైనదని ఇలాంటి దాడులు సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని మునుగోడు నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చిరువెల్లి ప్రవీణ్ శర్మ అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి దాడిని ఖండిస్తున్నామని దాడి చేసిన వ్యక్తులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో బ్రాహ్మణులపై, అర్చకులపై దాడులు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట కార్యదర్శి మాడ పాపయ్య శర్మ, కోశాధికారి వేమవరపు వెంకటరమణ శర్మ ఉన్నారు.