- దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు
- రైతులపై కేసులు పెట్టొద్దని సీఎం ఆదేశించారు
- మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ
- కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డికి పరామర్శ
ఎల్బీనగర్, నవంబర్ 13: తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుట్రపూరిత రాజకీయాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెర లేపుతున్నదని మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలి కానీ దాడులకు పాల్పడడం ఏంటని వారు ప్రశ్నించారు.
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణలో భాగంగా వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులు, కొడంగ ల్ ఏరియా అభివృద్ధి డెవలప్‌మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డిపై జరిగిన దాడిని మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంకట్‌రెడ్డిని ఎల్బీనగర్ ఆర్కే ఎన్ క్లేవ్స్‌లోని ఆయన నివాసంలో మంత్రులు పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అధికారులపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. లగచర్ల ఘటనలో రాజకీయ కుట్ర ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోందన్నారు. దాడితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం చట్టపరమైన చర్య లు తీసుకుంటుందని తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచ మ్మ, రంగనాయక్ సాగర్ భూ నిర్వాసితులు నిరసనలు తెలిపి తమ హక్కులను సాధించుకున్నారని కానీ అధికారులపై దాడులు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంలో హింస కు తావులేదని స్పష్టం చేశారు.
ప్రజాభిప్రాయాలను గౌరవిస్తాం: మంత్రి దామోదర
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయాలు, సూచనలను గౌరవిస్తుందన్నారు. ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న అందరిపై చర్యలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన తప్పిదాలపై నిరసన చేస్తూ పోరాడమన్నారు. మల్లన్నసాగర్‌లోని వేములఘాట్ వద్ద ఎనిమిదేళ్లు టెంట్ వేసుకొని నిరసనలు తెలిపామని.. అధికారులకు సమస్య లు వివరించామే తప్ప దాడులు చేయలేదని గుర్తు చేశారు.
రైతులపై కేసులు పెడుతున్నట్లు బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, వారిపై కేసులు నమోదు చేయొద్దని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. వెంకట్‌రెడ్డిని పరా మర్శించిన వారిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, నాయకులు రామ్మోహన్‌గౌడ్, యోగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.