- రౌడిషీటర్, రేపిస్టును బీఆర్‌ఎస్ కార్యకర్తగా కేటీఆర్, పట్నం చెప్పుకోవడం సిగ్గుచేటు
- రాష్ట్రంలో అభివృద్దిని అడ్డుకునేందుకు కుట్రలు
- రీజినల్ రింగ్ రోడ్డును అమ్ముకున్న ఘనత బీఆర్‌ఎస్‌ది
- ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజం
సంగారెడ్డి, నవంబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రోత్సాహంతోనే రౌడీషీటర్, రేపిస్టు సురేశ్ వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి చేశాడని విరుచుకుపడ్డారు.
మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం వెళ్తూ మార్గమధ్యలో జహీరాబాద్‌లో ఆగిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ముందుకొస్తే.. బీఆర్‌ఎస్ నేతలు రౌడిషీటర్లతో అధికారులపై దాడులు చేసేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. రౌడీషీటర్లు, రేపిస్టును తమ కార్యకర్త అని చెపుకోవడం సిగ్గుచేటన్నారు.
కేటీఆర్‌కు, పట్నం నరేందర్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. అత్యాచారం కేసులో నిందితుడిని బీఆర్‌ఎస్ నేతలు తమ కార్యకర్త అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథలో వేల కోట్లు అవినీతి చేసిందని ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి అక్రమాలు చూసే శానస సభ ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పారని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీల ను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 70 శాతం రైతుల రుణమాఫీ చేసిందని, డిసెంబర్‌లోగా వందశాతం మాఫి చేస్తామని స్ప ష్టంచేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలను ఓర్వలేకే బీఆర్‌ఎస్ తప్పు డు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చింది
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంకు అప్పగించిందని కోమటిరెడ్డి ఆరోపిం చారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులకు తమ ప్ర భుత్వం వడ్డీలు కడుతుందని అన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం రోడ్లు నిర్మాణానికి అధిక ప్రా ధాన్యత ఇస్తుందని చెప్పారు. 10 ఏండ్లు పాలన చేసిన బీఆర్‌ఎస్ వంద సంవత్సరాల దొపిడీ చేసిందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో 12 వేల కిల్లోమీటర్ల రోడ్ల నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్ఘా టించారు. ఓఆర్‌ఆర్ రోడ్డును అమ్ముకున్న ఘనతా బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంద ని ఎద్దేవాచేశారు. రూ.40 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డిసెంబర్‌లో ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి శం కుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
మూడు నాలుగేళ్లలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నాయని, అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. జహీరాబాద్ నియోజకవర్గంలో చెరాగ్‌పల్లి నుంచి మన్నాపూర్ రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లు, ఎల్గోయి రోడ్డుకు రూ.32 కోట్లు , అసద్‌గంజ్ రోడ్డుకు రూ.25 కోట్లు మంజురు చేశామని వివరించారు.
వికారాబాద్ నుంచి జహీరాబాద్ వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్రానికి ప్రతిపాదనాలు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, నాయకులు ఉజ్వల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.