calender_icon.png 27 December, 2024 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ఇంటిపై దాడి చిల్లర రాజకీయాలకు నిదర్శనం

28-10-2024 12:38:14 AM

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కేటీఆర్ ఇంటిపై పోలీ సులు దౌర్జన్యంగా దాడి చేయడం చిల్లర రాజకీయాలు నిదర్శమని మా జీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం, వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో జరిగిన దా నికి కేటీఆర్‌కు సంబంధమేంటన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల పై చాలా ఆరోపణలు వస్తున్నాయ ని, వారి ఇండ్లపై ఇలాగే చేసే ద  మ్ముందా అని పోలీసులను ప్రశ్నించారు. స్వయంగా పోలీసులే రేవంత్ రెడ్డి తమ్ముడితో సెటిల్ చేసుకోవాలని బాధితులకు చెబుతున్నారని అ న్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రా మాలు ఆడుతున్నాయని విమర్శించారు.

మోదీ, ఆదానీలే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. చిల్లర దాడులు తమను భయపెట్టలేవని, తమకు అరెస్టులు కొత్త కాదని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.