29-04-2025 06:02:44 PM
గోదావరిఖని వైద్యులు రాజకీయ నాయకులతో దళిత జిల్లా వైద్యాధికారిపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలి..
గోదావరిఖనిలో మాదిగ లాయర్ల అసోసియేషన్ డిమాండ్...
గోదావరిఖని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా డిఎంహెచ్ఓ అన్నప్రసన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పలువురు వైద్యులు పలు రాజకీయ నాయకులు దళిత వైద్యాధికారిని చంపుతామని బెదిరించడం హేయనీయమైన చర్య అని గోదావరిఖని మాదిగల లాయర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జూపాక వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెరక మనోహర్లు తీవ్రంగా ఖండించారు.
మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... గోదావరిఖని లక్ష్మీ నగర్ స్వతంత్ర చౌక్ లోని శ్రీ మమత హాస్పిటల్ లో అనుమతి లేకుండా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ మిషన్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారని కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేయడానికి వచ్చిన జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నను శ్రీ మమతా హాస్పిటల్ యాజమాన్యం స్కానింగ్ సెంటర్ కు తాళం వేసి ఎవరి అనుమతి తీసుకొని వచ్చి తనిఖీ చేస్తున్నావ్ అంటూ బెదిరిస్తూ సీజ్ చేయకుండా తాళం వేసి నానా హంగామా సృష్టించారని ఒక దశలో ఆమెను భయభ్రాంతులకు గురి చేశారని వారన్నారు.
స్కానింగ్ సెంటర్ తాళం పగల గొట్టి చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ చేస్తున్న హాస్పటల్ చీకటి బాగోతాన్ని బయటపెట్టి స్కానింగ్ సెంటర్ సీజ్ చేసి పంచనామా నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్న తరుణంలో ఐఎంఏ కు చెందిన డాక్టర్ మరో ముగ్గురు రాజకీయ ముసుగు వేసుకున్న వైద్యులు మరో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని అని చెప్పుకుంటూ తిరిగే రాజకీయ నాయకుడు మమత హాస్పిటల్ యాజమాన్యం కలిసి డిఎంహెచ్ఓ అన్న ప్రసన్నపై దాటికి దిగుతూ దళితురాలని చూడకుండా దుర్భాషలాడుతూ పంచనామ రిపోర్టును చించి వేసి చంపుతామని బెదిరించడం దుర్మార్గమైన చర్య అని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడపిల్లలను గర్భంలోనే భ్రూణహత్యలు చేస్తూ అబార్షాలు చేస్తూ కోట్లు గడిస్తూ ఆడపిల్లలే లేకుండా చేస్తున్న ఆస్పటల్ యాజమాన్యం చీకటి వ్యాపారాన్ని బయటపెట్టిన డిఎంహెచ్ఓ ను అభినందించాల్సింది పోయి అంతు చూస్తాం అంటూ బెదిరించడం వైద్య వృత్తిలో ఉన్న ప్రైవేటు వైద్యలకు కళంకితంగా మారిందని మాఫియాల, ఫ్యాక్షనిస్టుల ప్రైవేటు డాక్టర్లు మెడికల్ షాప్ అసోసియేషన్ లోని కొందరు విచ్చలవిడిగా రెచ్చిపోతూ దాడుల పాల్పడడం సహించరానిదని అన్నారు. లింగనిర్ధారణ చట్టరీత్య నేరం అని ప్రభుత్వం ప్రకటిస్తున్న నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పురిటిలోనే అబార్షన్లు భ్రూణహత్యలు చేస్తూ ఆడ పిల్లల సంఖ్యను తగ్గిస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా డాక్టర్ వృత్తిలో ఉండి ఆడపిల్లల ఉనికి లేకుండా చేస్తున్న ఇలాంటి వైద్యులను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలన్నారు.
ఎమ్మెల్యే తన రాజకీయ అనుచరులు ఆగడాలు డిఎంహెచ్ వో దళిత అధికారిపై దాడులకు దిగడం పలువురు వైద్యులు అంతు చూస్తానడంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని జిల్లా మంత్రులు దీనిపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. జిల్లా వైద్యాధికారిపై దాడి చేసే నిచానికి దిగజారి ఇక్కడి ప్రైవేట్ వైద్యుల పై రాజకీయ నాయకుల పై పోలీసు ఉన్నతాధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా వ్యవహరించాలని కోరారు. గోదావరిఖని లక్ష్మీ నగర్ కళ్యాణ్ నగర్ లో వైద్యుల మోసాలు అనుమతి లేని లింగ నిర్ధారణ స్కానింగ్ సెంటర్ లపై బీఫార్మసీ సర్టిఫికెట్ లేని మెడికల్ షాప్ నిర్వాహకులపై నకిలీ మందులు అమ్ముతున్న మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్స్ అండ్ కెమికల్స్ ఉన్నత అధికారులు ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు చర్యలు చేపట్టే విధంగా దాడులు నిర్వహించి, అధికారులపై దాడులు చేస్తున్న వీరి ఆగడాలను అరికట్టాలని కోరారు.
కల్వచర్లలో గట్టు వామన్ రావు అడ్వకేట్ దంపతులను నడిరోడ్డుపై ఎలాగా చంపారు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ జోలికి వస్తే నిన్ను నడిరోడ్డు మీద చంపేస్తామని పలువురు వైద్యులు రాజకీయ నాయకులు పెద్దపల్లి జిల్లా దళిత వైద్యాధికారిని బెదిరించడం హేయనీయమైన చర్య అని ఈ సంఘటనపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాదిగ లాయర్ల అసోసియేషన్ (ఎమ్. ఎల్.ఏ) అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెరిక మనోహర్, వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కోశాధికారి రాజ్ కుమార్, కాదాసి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.