calender_icon.png 24 November, 2024 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి

24-11-2024 07:14:14 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి సిఐటియు ఆఫీసులో ఆదివారం అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు జిల్లా కన్వీనర్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీ అమలు చేయకుండా రోజుకొక కొత్త కొత్త పనులు పెడుతూ పని భారాన్ని మోపుతున్నారు తప్ప పనికి తగ్గట్టు వేతనం ఇస్తలేరని ఆవేదన వ్యక్తపరిచారు.

క్రష్ సెంటర్స్ పేర్లతో అంగన్వాడి సెంటర్లలో జాతీయ నూతన విద్య విధానం కార్మికులకు తెలియకుండానే అమలుపరిచే ధోరణి తప్ప అంగన్వాడీలను మార్పు పేరుతో సీసీ కెమెరా బయోమెట్రిక్ అంగన్వాడి సెంటర్లలో ఎల్కేజీ యూకేజీ అంటూ అంగన్వాడీలకు అయోమయానికి గురి చేస్తున్నారు. అంగన్వాడీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని. టాయిలెట్ రూమ్స్ భవనం లేని సెంటర్స్ కు కొత్త భవనం నిర్మించాలని అంగన్వాడీలో కనీస వేతనం 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్. అంగన్వాడీలకు అదనపు పని భారాలు పెంచుతూ  బి ఎల్ ఓ కుటుంబ సర్వే లాంటివి పనిభారాలు పెంచుతూ  వీరికి వచ్చే పాత టీఏడీఏలు, హౌస్ రెంట్ బిల్లులు, కూరగాయల బిల్లులు, ఈవెంట్స్ బిల్లులు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ప్రభుత్వం ప్రింట్ చేసిన రిజిస్టర్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిటైర్మెంట్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ లకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా టీచర్స్ లకు రెండు లక్షల రూపాయలు హెల్పర్లకు లక్ష రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మినీ అంగన్వాడిలను మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించిన ప్రభుత్వం వీరికి మినీ వేతనం వెయ్యడం ఎంతవరకు సమంజసం మినీ అంగన్వాడి కేంద్రాలకు హెల్పర్స్ లను నియమించాలి. సీనియారిటీ కలిగి ఉన్న హెల్పర్లకు టీచర్లుగా ప్రమోట్ చేయాలి అన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సురేష్ అన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ  కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వీ.కల్పన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. బాబాయ్, జిల్లా ఉపాధ్యక్షురాలు బిలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ అనసూయ, జిల్లా కమిటీ సభ్యులు సురేఖ రాణి శోభారాణి అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.