26-04-2025 12:36:10 AM
వనపర్తి టౌన్ ఏప్రిల్ 25: వనపర్తి జిల్లాలో పోక్సో మరియు అత్యాచార బాధితులకు వైద్య, న్యాయ, సైకాలజికల్ సపోర్ట్ వంటి సేవలు ఒకే గొడుగు కిందకి తీసుకు వచ్చి పోలీసుశాఖలోని ఉమెన్ సేఫ్టీవింగ్ తమ వంతు సేవలు అంది స్తోంది.ఈ భరోసా కేంద్రము బాధితులు ఆర్థికంగా ఎదిగేలా స్వశక్తిపై జీవించేలా సహాయ సహకారాలు అందజేస్తుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.
శుక్రవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయం పక్షాన ఫోక్సో మరియు అత్యాచార కేసుల్లో ఉన్న ఎంతోమంది బాధితులకు అన్ని రకాలుగా వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తక్షణ సహాయo అందిస్తోంది. పోలీస్ శాఖ అందించే ఈ ఆర్థిక సహాయాన్ని సద్వి నియోగం చేసుకొని మంచిగా చదివి మంచి మార్కులు సా ధించిన విద్యార్థినీలను శుక్రవారం తమ చాంబర్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సన్మానించి అభినందించారు.
ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ... ఫోక్సో మరియు అత్యాచారం భరోసా కేంద్రం అండగా నిలుస్తుందన్నారు. ఆర్థిక భరోసాతో ఉన్నత చదువులు చదివి అన్ని రంగాలలో రానించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఎదిగి తమ కాళ్లపై నిలబడగలిగి మహిళ సాధికారతలో భాగం కావాలని ఎస్పీ సూ చించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు ఎస్పి, ఉమామహేశ్వరరావు, ఏహెచ్ టి యు, ఎస్త్స్ర, అంజద్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్, శిరీష, భరోసా సిబ్బంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు.