21-04-2025 01:22:20 AM
మలక్పేట్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బి ఆర్ ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని టిఆర్‌ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మాజీ ప్రధాన కార్యదర్శి ఆజం అలీ అన్నా రు. ఆజంపురా లోని పార్టీ కార్యాలయంలో ఆజం అలీ, నియోజకవర్గ ఇన్చార్జి తీగల అజి త్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ ము ఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌లో నిర్వహిస్తున్న రజోత్సవ సభ కు భారీ గా తరలి రావాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అభివృద్ధి జరగకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. పదేండ్ల టిఆ ర్‌ఎస్ పార్టీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.