నిజామాబాద్, నవంబర్ 25: సీనియర్ న్యాయవాది మహ్మద్ ఖాసీంపై దాడిని బార్ అసోషియేషన్ ఖండించింది. ఈ దాడిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టులో సోమవారం మాట్లాడారు. ఖిల్లారోడ్డులో ఉన్న మహ్మద్‌ఖాసీం కార్యాలయ స్థలాన్ని తమకు విక్రయించాలని బెదిరిస్తూ మహ్మద్ ఖాసీంపై హర్షత్‌ఖాన్, ముజాఫర్‌ఖాన్, ముజాయిత్‌ఖాన్ ఆదివారం దాడి చేసినట్టు బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్ తెలిపారు.
దుండగులపై గతంలోనే క్రిమినల్ కేసులు ఉన్నాయని.. వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం మహ్మద్‌ఖాసీంతో ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.