calender_icon.png 19 March, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ డీకే అరుణ ఇంట్లో దూరిన దుండగుడి అరెస్ట్

19-03-2025 01:25:41 AM

 ఉత్తరాఖండ్‌కు చెందిన పాత నేరస్థుడిగా గుర్తింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (విజయక్రాంతి): ఈ నెల 16న జూబ్లీహిల్స్‌లోని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లో దూరిన దుండగుడిని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ ఉదమ్‌సింగ్ నగర్‌కు చెందిన మహమ్మద్ అక్రమ్‌గా గుర్తించారు. ప్రస్తుతం నగరంలోని తలాబ్‌కట్, అమన్‌నగర్ బిలోని ఓ ఇంట్లో నివాసముంటూ టైల్స్ పని చేస్తున్నట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు.

ఎనిమిది బృందాలతో దర్యాప్తు చేసి నిందితుడ్ని పట్టుకున్నట్టు తెలిపారు. ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై 17 చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోనూ పలు చోరీలకు పాల్పడ్డట్లు వెల్లడించారు. డీకే అరుణ ఇంట్లో కూడా చోరీ చేసేందుకే ప్రవేశించాడని చెప్పారు. అది ఎంపీ ఇల్లు అని తెలియకుండానే దొంగతనానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు.