calender_icon.png 19 April, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

18-04-2025 12:37:53 AM

కల్లూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు.. జై భీమ్.. జై సoవిదాన్ పాదయాత్ర 

కల్లూరు , ఏప్రిల్ 17 :- దేశంలో, రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న పార్టీ లను తరిమి కొట్టాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కల్లూరు పట్టణంలో జై బాపు..జై భీమ్..జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్బంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చేసిన త్యాగాలను అవమానపరుస్తూ, అంబేద్కర్ అందించిన హక్కులను కొందరు కాలరాస్తున్న ఈ తరుణంలో అందరూ ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని పేర్కొన్నారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సీయం రేవంత్ రెడ్డి సహకారం, నేతృత్వంలో సత్తుపల్లి నియోజకవర్గo పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని తెలిపారు.పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని అన్నారు. కేవలం 15 నెలల కాలంలోనే నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వంలో రూ. 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, ఎస్సీ సెల్ నాయకులు బొడ్డు బొందయ్య,  కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,  వైస్ చైర్మన్ కోటేశ్వరావు, పార్టీ మండల సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు,  కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు, కల్లూరు పట్టణ నాయకులు భాగం ప్రభాకర్ చౌదరి, పెద్దబోయిన శ్రీనివాసరావు, అల్లకుంట నరసింహారావు, మట్టా రామకృష్ణ, శివకుమార్ నాయక్,  కీసర మధుసూదన్ రెడ్డి,  కీసర శ్రీనివాస్ రెడ్డి,  కీసర రవీందర్ రెడ్డి,  జోనబోయిన గోపాల్ రెడ్డి, ముగ్గు వెంకటాపురం మాజీ సర్పంచ్ రావి పాపారావు, మాజీ సర్పంచ్ విశ్వనాధం, చిలక ముని బాబు,  కల్లేపల్లి రమేష్,మండల కార్యకర్తలు,మహిళా,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.