06-07-2024 12:34:15 AM
పూణె, జూలై 5 : పూణె రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టెకీల ప్రాణాలు బలిగొన్న 17 ఏళ్ల మైనర్ బాలుడి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఈ కేసులో జువెనైల్ బోర్డు షరతులపై బాలుడికి బెయిల్ మంజూరు చేసింది. రోడ్డు భద్రతపై 300 పదాల్లో వ్యాసం రా యాలని బాలుడికి సూచించింది. సదరు బాలుడు 300 పదాల్లో వ్యా సం రాసి బోర్డుకు సబ్‌మిట్ చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. మద్యం సేవించి ఖరీదైన పోర్షే కారు వేగంగా నడిపి ఇద్దరు టెకీల చావుకు కారణమైన బాలుడి కేసులో చాలా ట్విస్టులు బయటపడ్డాయి. బాలుడిని శిక్ష నుంచి తప్పించేందుకు అతని కు టుంబం విశ్వ ప్రయత్నాలు చేసింది. డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి ప్రమాదాన్ని తా నే చేశానని ఒప్పుకోవాలని బలవం తం చేసినట్లు డ్రైవర్ కుటుంబ సభ్యు లు ఆరోపించారు. బాలుడి తండ్రి విశాల్, తాత సురేంద్ర, తల్లిని అరెస్ట్ చేశారు. మే 19న కళ్యాణి నగర్‌లో రో డ్డు ప్రమాదం జరగ్గా.. జువెనైల్ జస్టిస్ బోర్డు మైనర్ బాలుడిని మే 22న అబ్జర్వేషన్ హోమ్‌కు పంపింది.