calender_icon.png 23 February, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజు కళారూపం

16-02-2025 12:00:00 AM

అనగనగా ఒక రాజు. అరేబియా సముద్రం దగ్గరలో ఉండే రాజ్యమది. అది రాజులు పరిపాలించే కాలం. ఆ కాలంలో ఓ రాజు ఉండేవారు. ఆయనకి చిన్నప్పుడే ఓ ప్రమాదం జరిగి ఒక కన్ను కోల్పోయాడు. అప్పటినుంచి ఆయన్ని ఒంటి కన్ను రాజుగారు అనేవాళ్లు. ఆ రాజుగారికి ఎప్పటినుంచో తన పోట్రెయిట్‌ను గీయించాలనే కోరిక ఉండేది. ఒక రోజు అప్పటికప్పుడే రాజ్యమంతా దండోరా వేయించారు. మంచి ఆర్టిస్టులను రాజ్యానికి రమ్మని ఆహ్వానించారు.

మరుసటి రోజు ఉదయాన్నే ఆర్టిస్టులంతా రాజ్యానికి వచ్చారు. అందరూ మాట్లాడుకుంటుండగా రాజుగారు సభలోకి వచ్చారు. ఎవరైనా సరే నా బొమ్మను తప్పుగా గీస్తే వారికి శిక్ష తప్పదని చెప్పారు. కొంతమంది భయపడి వెనక్కి తగ్గారు. అసలే రాజుగారికి కోపం వస్తే.. ప్రాణాలే పోతాయని గమ్మున కూర్చున్నారు. ముగ్గురు ఆర్టిస్టులు ముందుకు వచ్చారు. రాజు ఎదురుగా నిలబడ్డారు.

ఆయన బొమ్మను గీయటం ఆరంభించాడు మొదటి ఆర్టిస్టు. మనసులో ఆర్టిస్టు తన ప్రతిభను చూపించాలనుకున్నాడు. రాజు ఎలా ఉంటే అలా అందంగా గీశాడు. అందులో కన్ను కనిపించదనేట్లు ఉంది. ఇది చూసిన రాజు కోప్పడ్డాడు. ఒంటికన్ను మాత్రమే ఉందని వెక్కిరిస్తావా? అన్నాడు. తక్షణమే ‘ఇతన్ని సంహరించండి’ అని ఆజ్ఞాపించారు. వెనక ఉన్ననే మరో ఆర్టిస్టు భయపడిపోయారు.

అలా గీయకూడదని నిర్ణయించుకు న్నారు. తన వంతు వచ్చింది కాబట్టి ముందు కు వెళ్లాడు. రాజు బొమ్మను అందంగా గీశా రు. రెండు కళ్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. దీంతో ‘నన్ను ఇంప్రెస్ చేయటానికి ఇలా చేశావు. అసలు నేను ఇలా లేను కదా. కల్పితం గీశావు’ అన్నారు. వెంటనే భటులను పిలిచి ఇతన్ని కొన్ని రోజులు కారాగారంలో పడేయండి అన్నారు. ఇక మూడో ఆర్టిస్టు వంతు వచ్చింది.

అతను తెలివిగా రాజు ఒక వైపు భాగాన్నే గీశారు. అది కూడా ఆరోగ్యకరమైన కన్ను ఉండే భాగాన్నే గీశారు. అది చూసి రాజు ఆశ్చర్యపోయారు. ‘నీ తెలివికి మెచ్చితిని. ఉన్నది ఉన్నట్లు గీసినా నాకెంతో ఆనందంగా ఉంది’ అంటూనే దగ్గరకు రమ్మన్నాడు. బంగారు ఆభరణాలు, ఇతర బహుమతులను ఆ ఆర్టిస్టుకు ఇచ్చారు.