బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): మాల్కాజిగిరి ఎంపీ ఈ టల రాజేందర్ ఎవరిపైనా దాడి చేయలేదని, ఏకశిలానగర్‌లో కబ్జాదారులు దురుసుగా ప్రవర్తిస్తుం డగా నిలువరించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్రకార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం మున్సిపాలిటీ పరి ధిలోని కబ్జాదారులు ఆగడాలకు అడ్డులేకుండా పోయిందన్నారు. దీంతో బాధితులు మల్కాజ్ గిరి ఎంపీ రాజేందర్‌ను ఆశ్రయించారని వివరించారు. రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలో కబ్జాలను అరికట్టాలని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.