వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం దారుణమని, ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతులను అరెస్టు చేయడం పరిపాటిగా మారిందని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి అన్నారు. ఆయన నేరం చేసి ఉంటే ముందుగా నోటీసులు ఎం దుకు ఇవ్వలేదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టు వారెం ట్ చూపకుండా ఇంటికెళ్లి అరెస్టు చేయడమేంటి? అని ఆయన ప్రశ్నించారు.