calender_icon.png 17 January, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.4 వేల కోట్లకు చేరిన బకాయిలు

10-09-2024 12:41:57 AM

బంగ్లాదేశ్‌కు అదానీ గ్రూప్ వార్నింగ్

ముంబయి: రాజకీయ అనిశ్చితితో సతమతమవుతున్న పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఇంధన సంక్షోభం నానాటికీ తీవ్ర మవుతోంది. ఇంధన కొరతను తీర్చుకునే క్రమంలో అప్పుల భారం తాత్కాలిక ప్రభుత్వం నెత్తిన నిప్పులకుంపటిగా మారి ంది. భారత్‌కుచెందిన అదానీ గ్రూప్‌నకు ఆ దేశం దాదాపు 500 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.4వేల కోట్ల) బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై తాజాగా ఆ సంస్థ బంగ్లా ప్రభుత్వా న్ని హెచ్చరించింది. ఝార్ఖండ్‌లోఅదానీ పవర్‌కు చెందిన గొడ్డా ప్లాంట్ నుంచి మొత్తం విద్యుత్ ఉత్పత్తిని బంగ్లాదేశ్‌కు సరఫరా చేసేందుకు ఒప్పందం జరిగింది.

2017లో అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డుతో అదా నీ గ్రూప్  25 ఏళ్లకు అగ్రిమెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం కింద ప్లాంట్‌ల్లో ఉత్పత్తి అయ్యే 1496 మెగావాట్ల విద్యును బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్నారు. బంగ్లాదేశ్ విద్యుత్ డిమాండ్‌లో ఇది 10 శాతానికి సమానం. 2023 జూన్‌లో ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి మొదలవగా.. అప్పటినుంచి బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్నారు.

ఖర్చు లు, ఇతరత్రా కారణాలతో ఈ చెల్లింపుల ను బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఈ బకాయిలు ఇప్పు డు దాదాపు 500 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో అదానీ గ్రూప్.. మహ మ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగించలేమని పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి సరఫరా ను నిలిపివేయడం లేదని స్పష్టంచేసింది.