calender_icon.png 20 February, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయ ముఖద్వారం ఏర్పాటు అభినందనీయం

17-02-2025 06:55:34 PM

దౌల్తాబాద్: మల్లికార్జున స్వామి దేవాలయానికి ముఖ ద్వారం ఏర్పాటు చేయడం అభినందనీయమని బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ బీసీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి గ్రామంలో మల్లికార్జున దేవాలయానికి అడప స్వామి, రమేష్, యాదగిరిల సహకారంతో రూ.10 లక్షలతో నిర్మించిన ముఖ ద్వారంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మాచిన్ పల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి జాతరతో పాటు కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఈ ముఖ ద్వారం ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు.

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన గ్రామాన్ని, ఏ హోదాలో ఉన్న ఎంత దూరంలో ఉన్న మర్చిపోవద్దన్నారు. ఎక్కడ స్థిరపడ్డ గ్రామాన్ని మర్చిపోకుండా మల్లికార్జున స్వామి ఆలయానికి ముఖ ద్వారం ఏర్పాటు చేసిన రమేష్, యాదగిరి, స్వామి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూషణం,మామిండ్ల నాగరాజు, నర్సింలు, రాంచందర్ గౌడ్, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.