19-03-2025 12:00:00 AM
మహబూబాబాద్, ప్రతినిధి, మార్చి18 (విజయక్రాంతి): 42శాతం బీసీ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంచరిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అన్నారు.
సోమవారం బిసి సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో స్థానిక అంబెడ్కర్ సెంటర్లో శంతన్ రామరాజు నాయకత్వంలోమహబూబాబాద్ కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నం టాయి.ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం అనంతరం టపాసులు కాల్చి తమ ఆనందం వ్యక్తంచేశారు.
ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ ఎందరో విద్యార్థులు మేధావుల బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినమాట నిలబెట్టుకుందని సంతోషం వ్యక్తంచేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల్లో వాటా పెంచుతూ విద్య, ఉపాధి,పదోన్నతుల్లో బీసీలు ఎదుర్కొంటున్న అసమానతలు రూపుమాపిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. అసెంబ్లీ వేదికగా బీసీ బిల్లును ఆమోదింపజేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రతి బీసీ రుణపడి ఉంటారని ఆకాంక్షించారు. బిసి బిల్లును అసెంబ్లీ ఆమోదించి నట్టుగానే పార్లమెంటులో చట్టం చెయ్యాల్సిన బాధ్యత బీజేపీదేనని అన్నారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన బిఅరెస్, బిజెపి, వామపక్షాలు కేంద్రంపై వత్తిడితెచ్చి లోక్ సభలో బిసిబిల్లును ఆమోదించే భాధ్యతను ఎత్తుకోవాలని డిమాండ్ చేశారు.ఏదేమైనా బిసిబిల్లు ఆమోదం పొందడం బీసీల భవిష్యత్తుకు భరోసా అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసి సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యే డా. బి.మురళీ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. మిఠాయిలు పంచి సంబురాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కదిరే సురేందర్, మహ్మద్ నాసర్, గుగులోత్ రాములు నాయక్, రామరాజు ప్రవీణ్,టౌన్ మహిళా అధ్యక్షురాలు ఆనంతుల రాజమ్మ,బొమ్మరాజు కుమారస్వామి, సోమారపు వీరస్వామి, విద్యార్థి సంఘనేత సోమన్న, లింగోజు సరస్వతి, గోనె శ్యామ్ రావు, లక్ష్మి నర్సింహారావు, రాపాక పద్మ, ఆవేత్ కుమార్ పటేల్, కొండి సాయికిరణ్ నేత, మార్గం శైలు సురేష్, గుగులోత్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.