calender_icon.png 29 November, 2024 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూసుకొస్తున్న ‘ఫెంగల్’

29-11-2024 12:38:51 AM

ఈ నెల 30న తీరం దాటే అవకాశం

తుఫాను కారణంగా శ్రీలంకలో 12 మంది మృతి

చెన్నై, నవంబర్ 28: ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడు అనేక జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. తీర ప్రాంతా ల్లో 10 అడుగులమేర అలలు ఎగసిపడుతున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావా సాలకు తరలిస్తున్నారు. తుఫాను వల్ల ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు భారత నౌకా దళం సహాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. ఈ తుఫాను తమిళనాడు తీరం వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య ఈ నెల 30న తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేసింది. శ్రీలంకలో ఫెంగల్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను కారణంగా లంకలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ ఆకస్మిక వరదల్లో చిక్కుకుని మరణించిన ఆరుగురు చిన్నారుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.