29-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 28(విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం- లో పొందుపరిచిన అంశాలు, హక్కులపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లాలోని దహేగాం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన చట్టంలో పొం దుపరిచిన అంశాలపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులోఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాలతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. అంబేద్కర్ జయంతి రోజున భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభార తి నూతన ఆర్‌ఓఆర్ చట్టం ప్రారంభించిందని, ఈ చట్టంలోని అంశాల ద్వారా రైతు భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, రైతు కుటుంబం భూమిపై ఆధారపడి జీవిస్తుందని, ఈ క్రమంలో రైతులకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
భూ భారతి చట్టంలో అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యలను జాయింట్ సర్వే నిర్వహించి పరిష్కరించడం జరుగుతుందని, రికార్డులను తప్పులు ఉంటే సరి చేయడానికి అవకాశం ఉందని, ముఖ్యంగా భూభారతిలో అప్పీలు వ్యవస్థ చాలా కీలకమని తెలిపారు. తహసిల్దార్ జారీ చేసిన ఉత్తర్వులపై రైతుకు న్యాయం జరగకపోతే రాజస్వ మండల అధికారి / సబ్ కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ ద్వారా న్యా యం పొందవచ్చని, భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవ చ్చని తెలిపారు.
వారసత్వ భూముల విరాసత్ సమయంలో సంబంధిత కుటుంబ సభ్యులందరికీ నోటీసులు జారీ వ్యవస్థ ఉందని, గత ధరణి చట్టంలో ఈ అవకాశా లు లేకపోవడం వల్ల అనేక వివాదాలు తలెత్తాయని అన్నారు. జూన్ 2వ తేదీ తర్వాత ప్రతి గ్రామానికి గ్రామ పాలన అధికారులు వస్తారని, ప్రతి గ్రామంలో రెవె న్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
రైతుల సంక్షేమం దిశగా భూభారతి
ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూభారతి చట్టం అమలు ద్వారా గ్రామాలలో భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. ఈ చట్టం రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 18 రాష్ట్రాలలోని చట్టాలను అధ్యయనం చేసిందని, ఈ చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయిందని తెలిపారు.
పార్ట్ బి లో పెండింగ్ లోని భూమికి పరిష్కారం జరుగుతుందని, ధరణి పోర్టల్‌లో ఎటువంటి వాటికి అవకాశం లేదని, అందుకే రైతుల సంక్షేమం దిశగా భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు మనోహర్, తహసిల్దార్ కవిత, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.