calender_icon.png 25 April, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగ్గుమంటున్న సూరీడు

25-04-2025 02:30:52 AM

  1. ఉత్తర తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
  2. నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలకు అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నా యి. వరుసగా రెండోరోజూ గురువారం కూడా ఉత్తర తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా పెర్కిట్‌లో 45.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.3, ఆదిలాబాద్ జిల్లా చా ప్రాల, నిర్మల్ జిల్లా ముధోల్‌లో 45.2, మం చిర్యాల జిల్లా భీమినిలో 45.1, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

శుక్రవారం రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వడగాల్పులుంటా యని, రాత్రిపూట వేడి వాతావరణ పరిస్థితులుంటాయని వాతావరణశాఖ తెలిపింది. పలుచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, యాదాద్రి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.