* -బోయపల్లి గేటు వద్ద ఆందోళన వ్యక్తం చేసిన రైతన్న
* -నిలిచిన గూడ్స్ రైలు పట్టాలపై నిరసన వ్యక్తం చేసిన రైతులు
*-టెండర్ అయిన ధరల కంటే 200 అధికంగా ఇస్తామని ప్రకటించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి
* -ఆందోళన విరమించిన రైతులు
మహబూబ్ నగర్, జనవరి 2౮ (విజయ క్రాంతి): ధరలు చాలా తక్కువగా ఉన్నాయ ని... పెట్టుబడి కూడా గిట్టుబాటు అవత లేదని మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ నందు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతా లేదు ధరలు లేవు అనే కథనమును విజయ క్రాంతి మంగళవారం ప్రచురం చేసిన విషయం వితమే.
ఈ క్రమంలోనే రైతులు తమకు మధిర కల్పించాలని మంగ ళవారం భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్ నుంచి బోయపల్లి రైల్వే గేట్ వరకు వచ్చి రైలు పట్టాలపై నిల్చొని తమ నిరసనను కొనసాగించారు. ఎట్టి పరిస్థితు ల్లో తమకు పల్లి ధర పెంచి కొనుగోలు చే యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆ సమయంలో గూడ్స్ రైలు కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా రైతులు పట్టాల పై చేస్తున్న ఆందోళనను చూసి కొంత దూ రంలో రైలును ఆపివేయడం జరిగింది. పోలీ సులు వేని వెంటనే స్పందించి రైతుల ను పట్టాలపై నుంచి పక్కకు వెళ్లి నిరసన తెలు పాలని కోరారు. దీంతో రైలు ముందుకు కది లింది.
అనంతం రైల్వే గేటు ముందే రైతులు గంట సమయం పాటు తమ నిరసనను కొ నసాగించారు. అనంతరం పోలీసులు రైతుల ను ఒప్పించి మార్కెట్ యార్డ్ ఆఫీ స్ దగ్గరికి తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ కూడా రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు.
చర్చలు సఫలీకతం... ఆందోళన విరమించిన రైతులు
పల్లి రైతుకు టెండర్ అయినా ధర కంటే అదనంగా ప్రతి క్వింటాలకు 200 రూపాయ లను అందించేందుకు కొనుగోలుదారులు ఒప్పుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ బిక్కరి అనిత మధుసూదన్ రెడ్డి మైకు ద్వారా ప్రకటించారు. కొనుగోడుదారులతో వ్యవ సాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సంబంధిత అధికారు లతో కొనుగోలుదారులతో దాదాపు గంట సమయం పాటు సమీక్షించారు.
అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ బేక్కరి అనిత మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా టెండర్ అయిన దర కంటే అధికంగా ప్రతి క్వింటాలకు 100 రూపాయలు మాత్రం ప్రకటించడంతో రైతులు తమ నిరసన కొనసాగించడంతో స్పందించి వెన్ను వెంటనే మరో వంద రూపాయలు అదనంగా మొత్తం రూ 200 ప్రతి క్వింటాలకు టెండర్ అయిన ధర కంటే అధికంగా ఇస్తామని చెప్పారు. దీంతో రైతులు తమ నిరసనను విరమించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా రైతుల నిరసన కొనసాగింది.