calender_icon.png 30 April, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నల ఆగ్రహం

30-04-2025 12:09:21 AM

  1. రోడ్డెక్కిన రైతన్నలు 

గింజ తడిసి చెదలెక్కుతున్నాయ్

రోడ్డుపై  రైతుల ఆందోళన

రహదారిపై ధర్నా-,నిలిచిపోయిన వాహనాలు 

ఎండలో ప్రయాణికుల ఇబ్బందులు

కేంద్రాల వద్ద మూలుగుతున్న వేల ధాన్యం బస్తాలు 

వెంటనే కలెక్టర్ రావాలని  నిరసనలు

గోపాలపేట ఏప్రిల్ 29: రైతన్నలు అప్పు లు చేసి పగలు రేయనక కాయకష్టం చేసి పంటచేర్లకు కాపలాగా ఉండి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాల లో విక్రయించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి సుమారుగా 20 నుం చి 25 రోజులపాటు గడుస్తుంది. చుట్టుపక్క గ్రామాల రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో చేర్చారు. ఐకెపి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సరఫరా చేసేందుకు లారీల సౌకర్యాలు లేక వరి ధాన్యం కేంద్రాలలోనే మూలుగుతున్నాయి.

అట్టి దాన్యం గింజలు మొలక రావడం బూజు పట్టడంతో రైతులు ఆగ్రహానికి కంచె లు తెంచుకున్నాయి. ఒకసారి గా రైతన్నలు రోడ్డు ఎక్కారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో ప్రధాన రహదారిపై రైతన్నలు బైఠాయించారు. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలుచుకోవడం పట్ల ప్రయాణికులకు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కున్నాయి. వేసవికాలం ఎండలు మండుటతుండడంతో ప్రయాణికు లు దాహార్తికి బాటలు పట్టారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో హైద్రాబాద్ -వనపర్తి మెయిన్ రోడ్డుపై రైతులు ధర్నా చేశారు...ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలలో కాంట చేసి లారీలు రాక కొనుగోలు కేంద్రాలలో రోజుల కొద్దీ వేల కొద్దీ బస్తాలు కేంద్రా లలో నిల్వ ఉన్నాయని,వర్షాలకు, ఈదురు గాలులకు ధాన్యం తడిసి బస్తాలు చెదలు ప డుతున్నాయని  రైతులు  ఆవేదన చెందారు.. 

వెంటనే లారీలు రప్పించి ధాన్యాన్ని మార్కెట్ కు తరలించాలని కోరారు..ప్రభు త్వం రైతులపై చేస్తున్న మొండి వైఖరి వీడాలని రైతులు వాపోయారు... రోడ్డుపై ధర్నా చేయడంతో వాహనాలు అలాగే నిలిచి పోయాయి.. స్థానిక ఎస్త్స్ర నరేష్,తహసీల్దార్ తిలక్ రెడ్డి వచ్చి రైతులకు నచ్చజెప్పి పై అధికారులతో మాట్లాడి లారీలు రప్పిస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.