17-04-2025 12:00:00 AM
విచారణ చేపట్టిన సీడీపీఓ
మహబూబాబాద్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మణిదీప్ అనే చిన్నారికి అంగన్వాడీ ఆయా కత్తి వేడి చేసి వాత పెట్టినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సిడిపిఓ శిరీష విచారణ నిర్వహిస్తున్నారు. గత గురువారం తమ పిల్లాడిని అంగన్వాడీ ఆయా కాల్చి వాత పెట్టిందని,
ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు శనివారం అధికారు లకు ఫిర్యాదు చేయగా స్థానికంగా ఆయా పనితీరుపై సిడిపిఓ విచారణ నిర్వహించారు. ఆయా పనితీరు సరిగా లేదని, పలువురు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై నివేదిక జిల్లా కలెక్టర్, ఉన్నతాధి కారులకు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామని సిడిపిఓ తెలిపారు.