- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 80 కోట్ల అభివృద్ధి
- పనులకు శంకుస్థాపనలు పదేళ్ల ప్రతిపక్ష పాలనతో అభివృద్ధిలో వెనుకబాటు
- త్వరలో వికారాబాద్ కు మహర్దశ అనంతగిరిలో మేఘ ప్రైవేట్
- లిమిటెడ్ 1000 కోట్లతో అభివృద్ధి
వికారాబాద్ జనవరి 24: వికారాబాద్ అభివృద్ధి తన ప్రధాన ఆశయమని డబ్బు, భూములు సంపాదించుకోవాలనే ఆశ లేదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలో సుమారు రూ. 80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం శిలాఫలకాలు వేసి కాంట్రాక్టర్లకు కాగితాలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ శిలాఫలకాలకు డబ్బులు విడుదల చేస్తూ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం సీఎం రేవంత్ రెడ్డి కేవలం పేదల కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అహర్నిశలు సీఎం శ్రమిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు సింగపూర్ దావోస్ పర్యటన సందర్భంగా గతంలో ఎన్నడు లేని విధంగా లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులతో ఒప్పందం చేసుకోవడం ఎందుకు నిదర్శనం అన్నారు.
వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు మేఘ ప్రైవేట్ లిమిటెడ్ 1000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఎం ఓ యు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు వికారాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు.
రూ. 1000ల కోట్లతో వికారాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు..
వికారాబాద్ జిల్లా కేంద్రానికి రూపాయలు 800 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని స్పీకర్ తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామ న్నారు. త్రిబుల్ ఆర్ సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చెరువుతో మన వికారాబాద్ పక్కనుండే పోనుందని స్పీకర్ తెలిపారు. 4200 కోట్లతో జిల్లాలోని పలురోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు.
త్వరలో జాతీయ రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్గారిని కలిసి ప్రతిపాదనలను అందించనున్నట్లు తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ఏడు చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశామని సంబంధిత అధికారులతో కూడా చర్చించడం పూర్తయినట్లు స్పీకర్ తెలిపారు.
10 ఏళ్లలో వికారాబాద్ కు మహర్దశ
రానున్న పది ఏళ్లలో వికారాబాద్ కు మహర్దశ రానుందని స్పీకర్ తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో 10 ఏళ్లు వెనక్కి పోయినట్లు తెలిపారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తన స్థాయి ని మించి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తు న్నట్లు స్పీకర్ అన్నారు. టిఆర్‌ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటే తాను ఎప్పుడు కెసి ఆర్‌ను నరేంద్ర మోడీని విమర్శిం చలేద న్నారు. తప్పు చేస్తే విమర్శించాలని తాను తప్పు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.