calender_icon.png 11 January, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెర సమ్మోహనం

07-10-2024 12:00:00 AM

సురయ్యా.. అప్సరస.. గానంలో గంధర్వ కోకిల.. నటనలో కోహినూర్ వజ్రం.. యాక్టర్‌గా తన అందంతో.. సింగర్‌గా స్వరమాధ్యుర్యంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేది. ఆ దశాబ్దంలో అంతటి అందగత్తె మరెవరూ లేరు. అప్పట్లో ఆమె క్వీన్ ఆఫ్ బ్యూటీ.

సురయ్యా లాహోర్‌లో జన్మించినా, బొంబాయిలోని మెరైన్ డ్రైవ్‌లో అమ్మ, అమ్మమ్మలతో ఉంటూ జె.బి.పెటిల్ హైస్కూల్‌లో చేరినప్పుడు తన ఫ్రెండ్స్ ఎవరంటే.. తన కంటే ఆరేళ్లు పెద్దవాళ్లున రాజ్ కపూర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరుగాంచిన మదన్ మోహన్! ముగ్గురు కలిసి బొంబాయి ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడేవారు.

బాల నటిగా ఏడు ఏళ్లకే నర్గీస్‌తో కలసి ‘మేడం ఫాషన్ అనే మూవీ లో యాక్ట్ చేస్తూ పాడింది. 1945 నుంచి 1961 దాకా హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ సురయ్యా! సురయ్యా మూవీకి లక్ష పారితోషికం తీసుకునే రోజుల్లో దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, రాజ్ కపూర్‌లకు ఆమె కన్నా  తక్కువ పారితోషికం.

మలుపుతిప్పిన ప్రేమ

విద్య, జీత్, షాయిర్, అఫ్సార్, నీలి, దో సితారే, సనం.. ఇవన్నీ సురయ్యా హీరోయిన్‌గా నటించిన చిత్రాలే. కాకపోతే వీటికో ప్రత్యేకత ఉంది. అప్పుడప్పుడే అప్ కమింగ్ హీరో దేవానంద్‌తో కలిసి నటించిన మూవీస్. విద్య మూవీలోనే పరస్పర ఆకర్షణ ఇద్దరికీ మొదలైంది, సురయ్యా రెకమెండేషన్‌తోనే దేవానంద్ ఇన్ని చిత్రాలు నటించాడు.

కాకపోతే దేవానంద్ గ్రెగరీ పెక్ హెయిర్ స్టుల్ మానరిజంమ్ ఇవన్నీ సురయ్యకు భలే నచ్చాయి. దేవానంద్ హిందువు, సురయ్యా ముస్లిం. పైగా వీరి వ్యవహారం పసిగట్టి ముందే హెచ్చరించారు. పెళ్లికి ససేమిరా అన్నా.

1951లో అఫ్సార్ షూటింగ్‌లో 3000 రూపాయల వజ్రపు రింగ్ తొడిగి మరీ ప్రపోజ్ చేశాడు దేవానంద్ సురయ్యాకు. ఇంటికెళ్లాక పెద్ద యుద్ధమే జరిగింది. ఆ ఉంగరాన్ని లాగి సముద్రంలో విసిరేసింది అమ్మమ్మ! మామయ్య ఈడ్చి కొట్టాడు.. ఇదీ గ్లామర్ స్టార్ల జీవితాలు. ఇక సనం ఇద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం. 

కట్టుబాట్ల కోసం..

అమ్మ, అమ్మమ్మ, మామయ్యలను ఎదిరించి రాలేనంది సురయ్యా.. చెంప ఛెళ్లు మనిపించాడు దేవానంద్ కూడా.. సురయ్యా కన్నీళ్ళతో గుండెలవిసేలా ఏడుస్తూ.. “దేవ్ ఇదే చెప్తున్నా” నేను పెళ్ళంటూ చేసుకుంటే.. అది నిన్నే.. అది వీలుకాదు కాబట్టి నా జన్మలో పెళ్ళి అంటూ చేసుకోను” చెప్పింది.

కోపంతో ఊగిపోతున్న దేవానంద్ విసురుగా వెళ్ళిపోయాడు. అదే వారి చివరి కలయిక. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నటించలేదు. 1954లో దేవ్ కల్పనా కార్తిక్ అనే సహ నటిని హడావిడిగా రిజిస్టర్ పెళ్ళి చేసుకుని ఆరోజు మధ్యాహ్నం షూటింగ్‌కు కూడా హాజరయ్యాడు. 

చివరిశ్వాస వరకు

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సురయ్యా, దేవానంద్ పెళ్లి చేసుకోవడం ఆమె తల్లి ముంతాజ్‌కు ఇష్టమే. కానీ పెద్దలకు ఎదు రు చెప్పలేక కూతురి సంతోషాన్ని బలిపెట్టారు. అయితే వాళ్లిద్దరూ చివరిసారి కలు సుకునేందుకు ఏర్పాట్లు చేసింది ముం తాజ్ కావడం విశేషం.

కానీ సురయ్యా మాత్రం మరొకరిని తన భర్తగా ఊహించుకోలేకపోయింది. దీంతో ఒంటరిగానే మిగి లిపోవాలని డిసైడ్ చేసుకున్నది. జీవితాం తం ఒంటరిగానే మిగిలిపోయారు. 74 ఏళ్ల వయసులో ప్రియుడు దేవానంద్‌ను తలుచుకుంటూ కన్నుమూశారు.