కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఒక సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన ను బీజేపీ రాజకీయంగా వాడుకునేందు కు ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అల్లు అర్జున్ కేసును బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆమె సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. సినీ పరిశ్రమను నాశనం చేసేందుకు తెలం గాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీజేపీ కేంద్ర మంత్రులు చేస్తున్న ఆరోపణలు గర్హనీయమని ఆమె పేర్కొన్నారు.